Jaggery Benefits: రోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Jaggery Benefits: బెల్లంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు చిన్న బెల్లం ముక్కను తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. మనం ప్రతి రోజు వంటలలో ఎదో ఒకరకంగా బెల్లంను ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది ఎదో ఒక బెల్లాన్ని వాడేస్తూ ఉంటారు.
ఆలా కాకూండా ముదురు రంగులో ఉండే ఆర్గానిక్ బెల్లం వాడితేనే మంచిది. లేత రంగు బెల్లంలో కెమికల్స్ కలుపుతారు. అందుకే లేత రంగులో ఉంటుంది. బెల్లం కొనేటప్పుడు ముదురు రంగులో ఉన్నది చూసుకొని కొనుగోలు చేయాలి. అయితే బెల్లం తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే గ్యాస్,కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణప్రక్రియ సాఫీగా సాగుతుంది. రక్తహీనత ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బెల్లంలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి కాంతిని నిచ్చి మొటిమలని నివారిస్తుంది.
బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.