Kitchenvantalu

Gutti Beerakaya Podi Fry Recipe:ఎప్పుడు చేసేలా కాకుండా బీరకాయ వేపుడు ఇలా చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది

Gutti Beerakaya Podi Fry: ఎంతో శ్రేష్టమైనా బీరకాయ తో ఫ్రై కర్రీస్ బోర్ అనిపిస్తే ,లేత బీరకాయలకు మసాల దట్టిచ్చి గుత్తిబీర కాయ స్పెషల్ చేయండి. రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
బీరకాయ – ¼ kg
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
నువ్వలు – 2 టేబుల్ స్పూన్స్
కొబ్బరి – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 3-4
జీలకర్ర – 1 ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 5-6
పెసలు – 1 టీ స్పూన్
లవంగాలు – 3
దాల్చిన చెక్క – 1 ఇంచ్
పసుపు – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా బీరకాయలను శుభ్రంచేసుకోని తొక్కతీసుకోవాలి.
2.గుత్తివంకాయ మాదిరిగా బీరకాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోని మద్యలో చీలికలు పెట్టుకోవాలి.
3.ఇప్పుడు మసాలా కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి ధనియాలు,జీలకర్ర,లవంగాలు ,దాల్చిన చెక్క,నువ్వులు.కొబ్బరి వేసి వేపుకోని చల్లారానివ్వండి.
4.ఇప్పుడు మిక్సి జార్ లోకి వెల్లుల్లి రెబ్బలు ,పసుపు,వేపుకున్న ఎండుమిర్చి,మసాల దినుసులు,ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5.గ్రైండ్ చేసుకున్న మసాలాను బీరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోని మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి.

6.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకోని నూనే వేడి చేసి అందులోకి పచ్చిమర్చి,జీలకర్ర,అవాలు,ఎండుమిర్చి ,కరివేపాకు వేసి వేపుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి స్టఫ్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి మిక్స్ చేసుకోని మూతపెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.
8.లోఫ్లేమ్ కలుపుతు మరికాసేపు ఉడికించుకోవాలి.
9.ఇప్పుడు అందులోకి మిగిలిన మసాలా పొడిని వేసి ,కొద్దిగా కొత్తిమీర చల్లుకోని మూత పెట్టుకోని మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
10. అంతే స్పైసీ అండ్ టేస్టీ గుత్తి బీరకాయ కూర రెడీ.