ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా 15 రోజుల్లో మాయం..!
weight Loss Drink in telugu : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అందువల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చాలా విసిగిపోయి నిరాశతో ఉంటారు.
మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలాకాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా తయారు చేసుకున్న ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే బరువు తగ్గటాన్ని గమనిస్తారు. ఎక్కువసేపు కూర్చుని ఉండటం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, శారీరిక శ్రమ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో పొట్ట వద్ద కొవ్వు ఎక్కువగా పేరుకు పోతుంది.
పొట్ట వద్ద ఉన్న కొవ్వు కరగాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి… అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను తీసుకోని తొక్క తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి… నీరు కాస్త వేడి అయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఏడు లవంగాలు వేసి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత ఒక స్పూన్ Coffee Powder, రెండు స్పూన్ల తరిగిన parsley leaves వేసి ఒక నిమిషం బాగా కలిపి పొయ్యి ఆఫ్ చేసి… గిన్నె మీద మూత పెట్టి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ నిమ్మరసం కలిపితే డ్రింక్ తయారైనట్టే. ఈ డ్రింక్ ను ఉదయం సమయంలో తీసుకుంటే పొట్ట వద్ద ఉన్న కొవ్వు క్రమంగా కరుగుతుంది.
వేలాడే పొట్ట టైట్ గా మరియు నాజుగ్గా మారుతుంది. కాబట్టి ఈ డ్రింక్ తీసుకుని శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త శ్రద్ధ సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మన ఆరోగ్యానికి సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.