White Hair:ఈ పేస్ట్ తెల్ల జుట్టు, చుండ్రు, జుట్టు రాలే సమస్య అన్నింటికీ చెక్ పెడుతుంది
white hair dandruff and hair fall problems : మారిన జీవనశైలి పరిస్థితి, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్య వంటివి ఎక్కువగా వస్తున్నాయి. వీటితో పాటు చుండ్రు కూడా వచ్చేస్తుంది.
ఈ సమస్యల నుండి బయట పడటానికి మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడకుండా ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్ధవంతంగా తగ్గించు కోవచ్చు. ఒక మిక్సీ జార్ లో శుభ్రంగా కడిగిన 5 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకును శుభ్రంగా కడిగి వేయాలి.
ఆ తర్వాత చిన్న బీట్ రూట్ లో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక గుడ్డు తెల్లసొన, 3 స్పూన్ల ఆలోవెరా జెల్, 3 స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.
రెండు గంటలు అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు,జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య తగ్గటమే కాకుండా పొడిగా మారిన జుట్టు తేమగా మారుతుంది. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.