Devotional

Naivedyam:ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా?

Naivedyam:ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా.. మనం సకల దేవతలను ఆరాధిస్తున్నాం. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. అయితే ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా

బ్రహ్మ దేవునకు జావ నైవేద్యం పెట్టాలి .
శ్రీ మహవిష్ణువునకు శ్రేష్టాన్నం .
ఇంద్రునికి భక్ష్యములు నివేదించాలి .
అగ్ని దేవునకు హవిష్యాన్నం .
వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం నైవేద్యం పెట్టాలి.
ధనరాజు కుబేరునకు , వాని మిత్రుడు సూర్య దేవునకు శర్కరాన్నం.
యమునకు తీలాన్నం .
అశ్వనీకుమారులకు భక్ష్యములు .
పితృదేవతలకి తేనే , నేయితో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టాలి.
గౌరీదేవికి జావ నైవేద్యం పెట్టాలి.
శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు నైవేద్యం.
చదువుల తల్లి సరస్వతిదేవికి త్రిమధురం.
ఋషులకు క్షిరన్నం.
సర్పములకు పాలు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ