Immunity:వ్యాధి నిరోధకత శక్తి సహజంగా పెరగాలంటే…..
Immunity:ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. తరచూ దగ్గు, జలుబు వేదిస్తున్నాయా? అయితే వారికీ వ్యాధి నిరోధకత శక్తి తగ్గిందేమో అని ఆలోచించండి. వ్యాధి నిరోధకత శక్తి సహజంగా పెరగాలంటే తీసుకొనే ఆహారంలో పెరుగు, ఓట్స్,బార్లి,వెల్లుల్లి ఉండేలా చూసుకోండి.
పెరుగు
చాలా మంది చిన్నారులు పెరుగు అంటే ఆమడ దూరం పరుగెడతారు. అయితే దానిలో ఉండే సుగుణాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియ వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుంది. జీర్ణ శక్తిని మెరుగుపరిచి తద్వారా వ్యాధి నిరోధకత శక్తిని పెంచుతుంది.
ఓట్స్,బార్లి
దీనిలో బీటా గ్లూటెన్ సమృద్దిగా ఉంటుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఓట్స్,బార్లి తరచుగా తీసుకోవటం వలన గాయాలు,పుండ్లు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
వెల్లుల్లి
ఉల్లిలో ఉండే అన్ని సుగుణాలు దీనిలో ఉన్నాయి. వెల్లుల్లికి బ్యాక్టీరియతో పోరాడే గుణం ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లిని తరచుగా తీసుకొనే వారిలో జలుబు సమస్య ఉండదని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.