Tomato Bath:టమాటో రైస్ బాత్…కేవలం 5 నిమిషాల్లో.. ఒక సారి రుచి చూడండి…సూపర్ గా ఉంటుంది
Tomato Bath:టమాటో రైస్ బాత్…కేవలం 5 నిమిషాల్లో.. ఒక సారి రుచి చూడండి…సూపర్ గా ఉంటుంది..
కావాల్సిన పదార్దాలు
బాసుమతి బియ్యం – రెండు కప్పులు
ఉల్లిపాయలు – 2 (ముక్కలుగా కోసుకోవాలి)
అల్లం,వెల్లుల్లిముద్ద – రెండు స్పూన్స్
టమోటాలు – 3 (ముక్కలుగా కోసుకోవాలి)
జీడిపప్పులు – 10-12
లవంగాలు – 3-4
సోంపు – అర స్పూన్
దాల్చిన చెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకులు – కొన్ని
పసుపు – చిటికెడు
కారం పొడి – రెండు స్పూన్స్
నూనె – మూడు స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – మూడున్నర కప్పులు
నిమ్మరసం – ఐ స్పూన్
తయారీ విధానం
మందపాటి గిన్నె లేదా బాండిలో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత సోంపు,దాల్చిన చెక్క,లవంగాలు,జీడిపప్పు,అల్లం,వెల్లులి ముద్ద వేసి బాగా వేగించాలి. అన్నీ దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి వేగించాలి.
ఇవి వేగిన తర్వాత పసుపు,ఉప్పు,కారం వేసి మరికొద్ది సేపు వేగించిన తర్వాత కడిగి పెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పడు తగినంత నీరు పోసి ఉడికించాలి. బియ్యం ఉడికిన తర్వాత నిమ్మరసం కలపాలి. దీన్ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి పెరుగు పచ్చడి మంచి కాంబినేషన్.