Anasuya Bharadwaj:అనసూయ ఎవరి కూతురో తెలుసా? నమ్మలేని నిజాలు
Anasuya Bharadwaj:సినీ హీరోయిన్లను తలదన్నే అందం ఆమె సొంతం… ఇప్పుడొస్తున్న యువతారలకాన్న ఆమె ఫ్యాన్ ఫాలోయింగే ఎక్కువ… ఇంతజేసీ ఆమె ఓ టెలివిజన్ యాంకర్ మాత్రమే… అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నా… మొదటి ప్రాధాన్యత మాత్రం బుల్లితెరకే ఇస్తుంది. ఆమె ఎవరో కాదు… స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.
జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులరైన అనసూయ సినీ రంగంలో కూడా తళుక్కుమంటోంది. మాటలతో మ్యాజిక్ చేసే వసపిట్టగా పేరుతెచ్చుకున్న ఈ బబ్లీ బ్యూటీ పెళ్లయినా తరగని సౌందర్యంతో కుర్రకారు హృదయాల్లో గిలిగింతలు పెడుతోంది.అనసూయ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే… ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి.
పక్కా తెలంగాణ అమ్మాయి. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట. అయితే బద్రుకా కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకున్న తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది.
అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రయివేట్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో చేరింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్ మెంట్ పెద్దలు. అయితే ఆమెకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమైంది.
ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నాగ వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా దర్శనమిచ్చింది. కానీ మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆమె అందచందాలు, వాక్చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ అయ్యాయి.
ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, గాయత్రి, వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ తన ముద్ర వేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది అనసూయ.
ఈ యాంకర్ భామ ఇతర యాంకర్లతో ఎంతో సఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రష్మితో ఆమెకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇక కాలేజ్ డేస్ లో ఎన్ సీసీ లో పరిచయం అయిన సుషాంక్ భరద్వాజ్ తో ప్రేమలో పడిన అనసూయ అతడినే పెళ్లి చేసుకుంది.
ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ భామకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అనసూయ భర్త సుశాంక్ ఓ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్. ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో చాన్సులు బాగానే వస్తున్నా తనకు ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోనని చెబుతోంది.