Hair Care Tips:జుట్టు ఒత్తుగా పెరగాలంటే నిమ్మతో ఇలా చేస్తే సరి
Hair Care Tips:మారిన జీవన శైలి తో ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు జుట్టు రాలటం చుండ్రు జుట్టు పొడిగా మారటం వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలు రాగానే డాక్టర్ దగ్గరికి పరుగెత్తాల్సి అవసరం లేదు మన ఇంటిలో రెగ్యులర్గా అందుబాటులో ఉండే నిమ్మకాయతో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు అయితే మిమ్మల్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం
ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసే అరగంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి ఒత్తుగా పెరుగుతుంది
చుండ్రు సమస్యతో బాధపడేవారికి కూడా నిమ్మరసం బాగా హెల్ప్ చేస్తుంది నిమ్మ రసాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి విధంగా గా వారంలో రెండుసార్లు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు
ఒక స్పూన్ పెరుగు లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే జుట్టు కి అవసరమైన పోషకాలు అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.