Biyyam Pindi Rotte Recipe : బియ్యం పిండి రొట్టెలను ఎప్పుడైనా తిన్నారా.. భలే రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..
Biyyam Pindi Rotte Recipe:రైస్ ఫ్లోర్ స్నాక్స్.. అందరికి కిచెన్ లో అందుబాటులో ఉండే రైస్ ఫ్లోర్ తో ఎన్నో స్నాక్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బొబ్బర్లతో బియ్యం పిండి స్నాక్స్ తయారు చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 2 కప్పులు
బొబ్బర్లు – ¼ కప్పు
పచ్చిమిర్చి – 4-5
అల్లం పేస్ట్ – కొద్దిగా
జీలకర్ర – 1 స్పూన్
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.ముందుగా బొబ్బర్లను నీళ్లలో రెండు,మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2.మిక్సి జార్ లోకి పచ్చిమిర్చి ,అల్లం వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులో రెండు కప్పుల నీళ్లను ఉప్పు వేసి మరగనివ్వాలి.
4.నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
5.మూతపెట్టి పదినిమిషాలు పక్కన పెట్టుకోండి.
6.ఇప్పుడు పిండి పూర్తిగా చల్లారక ముందే కులపుకోవాలి.
7.అందులోకి అల్లం ,పచ్చిమిర్చి పేస్ట్,జీలకర్ర వేసికలుపుకోవాలి.
8. చేతుతలకు నూనె రాసుకుని అరచేతుల పై అప్పాలను వత్తుకోవాలి లేదంటే షీట్ పై కూడ నూనె రాసి వత్తుకోవచ్చు.
9.పూరీల వత్తుకోని డీప్ ఫ్రై చేసుకోవాలి.
10.అంతే బియ్యం పిండి స్నాక్స్ రెడీ.