Kitchenvantalu

Egg Curry With Bengal Gram Powder Recipe:ధాబా స్టైల్ ఎగ్ కర్రీ..రైస్, చపాతీ, పులావ్ లో సూపర్ గా ఉంటుంది

Egg Curry;శనగ పిండి తో ఎగ్ కర్రీ..అందరు ఇష్టంగా తినే వంటకం అంటే అది ఎగ్ రెసిపీస్ అనే చెప్పాలే.ఎగ్ కర్రీ వెరైటీస్ ఎలా చేసినా రుచి అదిరిపోతుంది. శనగ పిండి కాంబినేషన్ తో ఈ సారీ ట్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు – 5
ఉల్లిపాయలు – 3
శనగపిండి – 2-3 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
కారం – 1 ½ స్పూన్
ఉప్పు -1 స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ స్పూన్
నూనె – తగినంత

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకోని అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక అందులోకి అల్లం ,వెల్లుల్లి పేస్ట్,పసుపు వేసి వేపుకోవాలి.
3.ఇప్పుడు అందులోకి కారం ,ఉప్పు,ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
4.ఇప్పుడు ఉడికించిన గుడ్లకి ఫోర్క్ సాయంతో రంద్రాలను చేసి యాడ్ చేసుకోవాలి.
5.ఉప్పు, కారాలు గుడ్లకు పట్టేలా బాగా మిక్స్ చేసి మూడు ,నాలుగు నిమిషాలు వేపుకోవాలి.
6.గుడ్లు వేగాక అందులోకి శనగ పిండి వేసి బాగా కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ.