Rava Sweet Recipe:కేవలం 10 నిమిషాల్లో బొంబయి రవ్వతో అప్పటికప్పుడు ఇలా స్వీట్ చేసుకోండి..
Sooji Sweet:సూజీ స్వీట్ రెసిపీ.. పిల్లల కోసం ఇంట్లో స్నాక్స్ ఎప్పుడు రెడి చేస్తు ఉండాలి. ఎన్ని వెరైటీస్ చేసినా కొత్త కొత్త రకాలు అడుగుతు ఉంటారు. ఈ సారి వెరైటీగా సూజీ స్వీట్ చేసి పెట్టండి.
కావాల్సిన పదార్ధాలు
బొంబాయి రవ్వ – 1 కప్పు
పాలు – 2 కప్పులు
చక్కెర – 1 కప్పు
మైదా – కొద్దిగా
యాలకుల పొడి – 1 స్పూన్
నూనె – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి రవ్వ వేసి రెండు,మూడు నిమిషాలు వేపుకోవాలి.
2.అందులోకి పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుతూ కాస్త ఉడకనివ్వాలి.
3.అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి రెండు ,మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పదినిమిషాల పాటు చల్లారనివ్వాలి.
5.చల్లారిన మిశ్రమాన్ని కలుపుతూ పిండి ముద్దాల ఏర్పడే వరకు కలుపుతూ ఉండాలి.
6.మిశ్రమం బాగా గట్టి పడితే కాసిన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు.
7.అవసరమైతే కాస్త మైదా పిండిని కలుపుకోవచ్చు.
8.మిశ్రమంలోకి యాలకుల పొడి వేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోని బాల్స్ లా చేసుకోని మందపాటి పూరీల చేసుకోవాలి.
9.ఇప్పుడు ఆ పూరిని మనకు నచ్చిన ఆకారాల్లో కట్ చేసుకోవచ్చు.
10.డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ఆయిల్ పెట్టుకోని కట్ చేసుకున్న ఆకారాలను లో ఫ్లేమ్ పై ఫ్రై చేసుకోవాలి.
11.ఇప్పుడు పాకం కోసం గిన్నెలోకి కప్పు చక్కెర ,గ్లాస్ నీళ్లను వేసి వేడి చేసుకోవాలి.
12.తీగ పాకం వచ్చే వకరు మరిగించుకోవాలి.
13.ఇప్పుడు అందులోకి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
14.మరుగుతున్న పాకంలో ఫ్రై చేసుకున్న సూజీలను వేసుకోవాలి.
15.ఇప్పుడు జల్లిగరిటతో తీసుకోని వేరొక ప్లేట్ లోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.
16.అంతే తియ్య తియ్యని స్వీట్ సూజి రెడీ.