Kitchenvantalu

Kandi Podi Recipe:రుచికరమైన కంది పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫన్స్,రైస్ లోకీ ఎంత బావుంటుందో..

Kandi Podi Recipe:కంది పొడి.. తెలుగు వారి భోజనం అంటే మొదటి ముద్ద పచ్చడి తో గాని,పొడితో కాని మొదలౌతుంది. వేడి వేడి అన్నంలో అలా కందిపొడి కరిగిన నెయ్యి వేసుకోని తింటే ఆ రుచే వేరే లెవల్లో ఉంటుంది. కంది పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు – ½ కప్పు
ఎండుమిర్చి – 10
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కందిపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో దోరగా వేపుకోవాలి.
2.కందిపప్పు వేగాక వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అదే ప్యాన్ లోకి మినపప్పు,ధనియాలు,ఎండుమిర్చి వేసి విడి విడిగా వేపుకోని తీసుకోవాలి.
4.అన్ని పదార్ధాలను చల్లారనివ్వాలి.
5.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేయించిన ఎండుమిర్చి ,జీలకర్ర,ఉప్పు,పసుపు వేసి వాటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి వేపుకున్న కందిపప్పు,ధనియాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7.గ్రైండ్ చేసుకున్న పొడని ప్లేట్ లో వేసుకోని చల్లారనివ్వాలి.
8.అంతే కమ్మని కందిపొడి రెడీ అయినట్టే.