Eating Food:ఆహారంను పద్దతిగా మరియు మితంగా ఎలా తీసుకోవాలి?
Eating Food:ఆహారంను మితంగా,పద్దతిగా తింటే ఎంత ఆరోగ్యమో,పద్దతి తప్పితే అంతకు రెట్టింపు అనారోగ్యం కలుగుతుంది. చాలా మంది తినటం కోసమే జీవిస్తున్నమనే రీతిలో తింటూ ఉంటారు. ఇది అంత మంచి పద్దతి కాదు. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటే మంచిదో చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు ఆహారాన్ని ఏ విధంగా తినకూడదో తెలుసుకుందాము.
ఆకలి అనిపించిన ప్రతిసారి ఏదో ఒక చిరుతిండి తింటూ ఉంటాము. ముందు ఆ విధమైన అలవాటును మానుకోవాలి. టీవి చుస్తునో,పేపర్ లేదా పుస్తకం చదువుతూ తింటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఆహారం తీసుకుంటున్నప్పుడు మరే దాని మీద దృష్టి పెట్టకండి. భోజనం ముందు భోజనంతో పాటుగా సోడా వంటి పానీయాలు తీసుకోకూడదు.
రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోవటం కానీ,పూర్తిగా ఆహారం మానివేయుట కానీ చేయకూడదు. బయట రెడీమేడ్ గా దొరికే ఆహారం అసలు తీసుకోకూడదు. రెడీమేడ్ ఆహారం అనేది బ్యాడ్ ఈటింగ్ హేబిట్ క్రిందకి వస్తుంది. ఎవరో తరుముతూ వస్తునట్లు లేదా తొందర లేదు అన్నంత నిదానంగా ఆహారాన్ని తీసుకోకూడదు. సాదారణంగా ఆహారాన్ని 10 నుంచి 15 నిమిషాలలో ముగించాలి.
ఒకేసారి ఆహారం ఎక్కువగా తీసుకోవటం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రోజు మొత్తం మీద తీసుకొనే ఆహారాన్ని ఐదు లేదా ఆరు భాగాలుగా విభజించి అన్నిసార్లు తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ ను ఆలస్యంగా తీసుకోకూడదు. ఇది ఒక విధంగా బ్యాడ్ ఈటింగ్ హేబిట్ క్రిందకే వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.