Sweet Corn Vada Recipe:తినే కొద్దీ తినాలనిపించే కార్న్ వడలు.. ఎక్సట్రా క్రిస్పీగా.. రుచిగా రావాలంటే..
Sweet Corn Vada:మొక్క జొన్న వడలు.. వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడి మొక్కజొన్న పొత్తులే కనిపిస్తుంటాయి. ఉడకబెట్టినవి,కాల్చినవి కాకుండా మొక్కజొన్న గింజలతో వడలు చేసి చూడండి .
కావాల్సిన పదార్ధాలు
స్వీట్ కార్న్ – 1 కప్పు
బియ్యం పిండి – ½ కప్పు
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 4-5
వెల్లుల్లి రెబ్బలు – 5-6
జీలకర్ర – ½ టీ స్పూన్
కారం – ½ స్పూన్
ఉప్పు – 1 స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా మిక్సి జార్ లోకి పచ్చిమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,మొక్కజొన్న గింజలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.
3.అందులోకి బియ్యం పిండి,తరిగిన ఉల్లిపాయలు,కొత్తిమీర,కరివేపాకు,జీలకర్ర,కారం,ఉప్పువేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
4.పిండి జారుగా వుంది అనుకుంటే మరి కాస్తా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి.
5.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి కొద్ది కొద్ది పిండిని తీసుకోని చేతులను తడుపుకోని వడలుగా వత్తుకోని నూనేలో వేసుకోవాలి.
6.రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాల్చుకుంటే కర కరలాడే టేస్టీ స్వీట్ కార్న్ వడలు రెడీ.