Face Glow Tips:ఎండకు నల్లగా మారిన చర్మం తెల్లగా మారాలంటే….
Face Glow Tips:ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల, యూవి కిరణాలు నేరుగా చర్మం మీద పడటం వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అయ్యి చర్మం నల్లగా మారుతుంది. దానినే సన్ ట్యాన్ అని అంటారు. చర్మం విషయంలో తగినన్నీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సన్ ట్యాన్ వల్ల చర్మం కమిలిపోవడంలాంటి సమస్య ఎదరవుతూ ఉంటుంది.
అయితే చర్మం మళ్లీ తాజాదన్నాన్ని సంతరించుకునేలా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే చర్మానికి ఎక్కువగా యూవీ కిరణాలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం నల్లగా మారకుండా ఉండటానికి మెలనిన్ తగ్గకుండా చూసుకోవాలి.
వీటితో పాటు స్కిన్ టాన్ ను న్యాచురల్ గా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. చర్మం ట్యాన్ కి గురి అయినప్పుడు చర్మం పొడిగా,నల్లగా మారిపోతుంది. సన్ ట్యాన్ నుండి బయట పడటానికి మార్కెట్ లో అనేక రకాల బ్యూటీ ఉత్పత్తులు లభ్యం అవుతాయి. వాటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది.
కానీ దీర్ఘకాలంగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే సన్ ట్యాన్ నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు. ఖర్చు తక్కువతో సులభంగా ఎండకు నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ చిట్కాకు అవసరమైన పదార్ధాలు ఏమిటో ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలో ఉపయోగించే ఇంగ్రిడియన్స్ అన్ని సులభంగా అందుబాటులో ఉండేవే.
టమోటా
నిమ్మకాయ
పేస్ట్
ఒక బౌల్ లో రెండు స్పూన్ల టమోటా రసంలో ఒక స్పూన్ నిమ్మరసం,తెల్లని టూట్ పేస్ట్ కొంచెం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే సన్ తాన్ నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.