Saggubiyyam vada Recipe:సగ్గుబియ్యం వడలు ఇలా చేయండి.. క్రిస్పీగా, టేస్టీ, మృదువుగా..
Saggubiyyam vada Recipe:సగ్గుబియ్యం వడలు..ఈవినింగ్ స్నాక్స్ కోసం వేడి వేడి వడలు వేస్తుంటాము.అందులోకి సగ్గు బియ్యం యాడ్ చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్ధాలు
సగ్గుబియ్యం – 1 కప్పు
బంగాళదుంపలు – 3
శనగ పిండి – 1/52 కప్పు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5-6
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – చిన్న కట్ట
ఉప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఉడికించిన బంగాళదుంపలను మాష్ చేసి తీసుకోవాలి.
3.అందులోకి,నానబెట్టుకున్న సగ్గుబియ్యం, శనగపిండి ,ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర,ఉప్పు వేసి పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి.
4.అందులోకి జీలకర్ర వేసి కలుపుకోవాలి.
5.డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి అరచేతులకు ఆయిల్ రాసుకోని చిన్న చిన్న వడలుగా వత్తుకోని మధ్యలో రధ్రం చేసుకోని ఆయిల్ లో వేసుకోవాలి.
6.రెండు వైపులా తిప్పుతు ఎర్రగా కాల్చుకుంటే సగ్గుబియ్యం వడలు రెడి.