Bisi Bele Bath Recipe:కర్ణాటక స్పెషల్ బిసిబెల్ బాత్.. ఈ కొలతలతో చేయండి.. మంచి రుచిగా ..
Bisi Bele Bath :బెసి బెలే బాత్.. సాంబార్ ని రైస్ తో కలిపి చేసే బెసి బెలే బాత్ చాలా రుచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఓసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 2 కప్పులు
ఎర్రపప్పు – 1 కప్పు
పచ్చిబఠానీలు – ½ కప్పు
బంగాళదుంప – ½ కప్పు
టమాటోలు – ½ కప్పు
క్యారేట్స్ – ½ కప్పు
క్యాబేజి – 1 కప్పు
బీన్స్ – ½ కప్పు
టమాటో – ½ కప్పు
శనగపప్పు – 4 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్
మెంతులు – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 10
లవంగాలు – 4
యాలకులు -2
షాజీరా – ½ టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్స్
మిరియాలు – 6
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
నెయ్యి – 4 టేబుల్ స్పూన్స్
తాలింపులు – 1 టేబుల్ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి – 5
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
చింతపండు – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
ములక్కాడలు -1
తయారీ విధానం
1.ముందుగా ప్రెషర్ కుక్కర్ లో బియ్యం ,పప్పు,ఆరు కప్పుల నీళ్లను వేసి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.ఒక గిన్నెలోకి పచ్చిబఠానీ,బంగాళ దుంప ముక్కలు,బీన్స్ ,టమాటోస్,క్యారేట్స్,క్యాబేజ్,గ్లాస్ నీళ్లను వేసి మూడు,నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి శనగపప్పు,మినపప్పు,మెంతులు,జీలకర్ర,ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చివేసి వేపుకోవాలి.
4.అందులోకి గరంమసాలా,ఇలాచ్చి,లవంగాలు ,మిరియాలు,నువ్వులు ,కొబ్బరి పొడి వేసి వేపుకోవాలి.
5.వేగిన తర్వాత అన్ని పదార్ధాలను చల్లారనివ్వాలి.
6.మిక్సిజార్ లో తీసుకోని అన్ని పదార్దాలను పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి వేడి చేసి అందులోకి తాలింపు గింజలు వేసి ,తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు ,ములక్కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి.
8.ఇప్పుడు అందులోకి పసుపు,అల్లంవెల్లులి పేస్ట్,ఉడికించిన కూరగాయ ముక్కలు వేసి ,చింతపండు గుజ్జును వేసి కలుపుకోవాలి.
9.ఇప్పుడు అందులోకి ఉడికించిన అన్నం ,పప్పు మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు వేసి,సరిపడా నీళ్లను కలుపుకోని ½ కప్పు బిసిబెలే బాత్ పౌడర్ వేసి కలుపుకోని ఐదు నిమిషాల పాటు ఉడకించాలి.
10.చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిసి బేలా బాత్ రెడీ.