Kitchenvantalu

Vankaya Bajji Recipe: బండి మీద అమ్మే వంకాయ బజ్జీ.. అదే రుచితో చేసేయండి..

Vankaya Bajji:వంకాయ బజ్జీ..చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటుంటే ఆ మజానే వేరు.ఎప్పుడు ఉల్లిపకోడి,మిరపకాయ బజ్జీలే కాకుండా అప్పుడప్పుడు వంకాయ బజ్జీలు కూడ చేసి చూడండి తప్పకుంట నచ్చుతాయి.ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 3-4
శనగపిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
వాము – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

తయారీ విధానం
1.ముందుగా వంకాయలను వంకాయలను గుండ్రని ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేసుకోవాలి.
2.ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి,బియ్యం పిండి,కారం,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్ర పొడి,పసుపు,వాము,బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.
3.కొద్దికొద్దిగా నీళ్లను వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండిని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

5.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి.
6.కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కలుపుకున్న పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
7.రెండు వైపులా తిప్పుతూ బ్రౌన్ కలర్ లోకి మారే వరకు వేపుకోని జల్లిగరిట సాయంతో ప్లేట్ లోకి తీసేసుకోవాలి.
8.అంతే వంకాయ బజ్జీ రెడి అయినట్టే.