Kitchenvantalu

Beetroot Payasam:బీట్ రూట్ పాయసాన్ని ఎప్పుడైనా చేసుకున్నారా…ఇప్పుడు ట్రై చేయండి

Beetroot Payasam:బీట్ రూట్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్ రూట్ తినాలంటే కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పే విధంగా పాయసం తయారుచేసుకొంటే.. పిల్ల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు
క్యారెట్‌ తురుము – అరకప్పు
బీట్‌రూట్‌ తురుము – 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
బాంబినో మాకరోనీలు – ఒక కప్పు
గోరువెచ్చని పాలు – 2 కప్పులు
వెనీలా ఐస్‌క్రీం – 2 కప్పులు
పంచదార – ఒకటిన్నర కప్పు
ఏలకుల పొడి – అర టీ స్పూను
నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు
ఎండు ద్రాక్ష – 10 చొప్పున
తేనె – 4 టీ స్పూన్లు
నెయ్యి – 1 టేబుల్‌ స్పూను
నీరు – మూడు కప్పులు

తయారుచేసే విధానం
బాణలి పెట్టి నెయ్యి వేసి బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుముల్ని పచ్చివాసన పోయేదాక మంట సిమ్ లో పెట్టి వేగించాలి. మరో గిన్నెలో 2 కప్పుల నీటిని పోసి మాకరోనీలు ఉడికించాలి. ఇవి మెత్తబడ్డాక వేగించిన బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుము, పంచదార, కొబ్బరి తురుము, యాలకుల పొడి, కప్పు నీరు పోసి పది నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు, తేనె, వెనీలా ఐస్‌క్రీమ్‌ కలిపి బాదం, జీడిపప్పు, ద్రాక్షలతో గార్నిష్ చేసుకుంటే బీట్ రూట్ పాయసం రెడీ.