Ravi Chettu:రావిచెట్టుతో మీ ఆరోగ్యం మీ చేతుల్లో…
Ravi Chettu:భోది వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. రావి చెట్టు అనేక ఔషధ విలువలకు నిలయం. అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది. ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది.
దంత సమస్యలకు రావి, మర్రి చెట్ల బెరడు ఉపయోగపడుతుంది. ఈ రెండు చెట్ల బెరడును సమ మోతాదులో కలిపి తీసుకొని ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని వేడి నీటిలో కలపాలి. దీనితో నోటిని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.
కామెర్లకు రావి చక్కటి మందుగా ఉపయోగపడుతుంది. 3-4 తాజా రావి ఆకులు తీసుకొని దానికి పట్టిక బెల్లం కలిపి పొడిగా చేసుకోవాలి. ఆ పౌడర్‌ను పావు లీటర్ నీటిలో కలిపి వడగట్టాలి. రోజుకు రెండుసార్ల చొప్పున ఐదు రోజులపాటు ఈ మిశ్రమాన్ని తాగించడం వల్ల కామెర్లు తగ్గుముఖం పడతాయి.
రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
తామరతో బాధపడేవారు 50 గ్రాముల రావి బెరడును బూడిదగా చేసుకొని దానికి నిమ్మ, నెయ్యి కలపాలి. ఆ పేస్టును తామర సోకిన చోట రాయాలి. రావి బెరడును నీటిలో మరిగించి 40 ఎం.ఎల్. చొప్పున తాగినా ఫలితం ఉంటుంది.
పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుంది.
డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.