Srikanth:హీరో శ్రీకాంత్ తొలి సినిమాకు వచ్చింది ఎంతో తెలుసా ?
Tollywood Hero Srikanth :తాజాగా నందమూరి నటసింహం నటించిన అఖండ మూవీతో హీరో శ్రీకాంత్ విలన్ అయ్యాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో బాలయ్యతో పాటు శ్రీకాంత్ కి కూడా మంచి పేరే వచ్చింది.
అయితే మొదట్లో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి, ఆతర్వాత హీరో అయ్యాడు.ఉషాకిరణ్ మూవీస్ పీపుల్స్ ఎన్ కౌంటర్ మూవీలో తొలిసారిగా నటించే ఛాన్స్ దక్కించుకున్న శ్రీకాంత్ అందులో నక్సల్ నేతగా నటించాడు.
విశాఖ దగ్గర అరకులోయ ప్రాంతంలో ఎక్కువ షూటింగ్ చేసిన ఈ మూవీలో నటించడం ద్వారా 5వేల రూపాయల పారితోషికం అందుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్యూలో శ్రీకాంత్ చెప్పాడు. తర్వాత పలు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి, దాదాపు 125మూవీస్ చేసాడు.
హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని , మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే పాత్రలు చేసి మెప్పించాడు. సినిమాలో కల్సి నటించిన హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీకాంత్ కెరీర్ లో పెళ్ళిసందడి మూవీ ఓ మధురానుభూతి. మళ్ళీ ఇప్పుడు అతడి కుమారుడు రోషన్ కూడా అదే పేరుతో గల సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నాడు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.