Kitchenvantalu

Kitchen Hacks:ఇల్లాలి కోసం అద్భుతమైన వంటింటి చిట్కాలు

kitchen tips In Telugu :సాధారణంగా మనం వంట చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా వంట ఈజీగా చేసేయొచ్చు.

వంటలు చేసినప్పుడు ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు కూరలో కాస్త బియ్యప్పిండి లేదా బంగాళదుంప రెండు ముక్కలు వేస్తే కూరలో ఎక్కువైన ఉప్పు అంతా పీల్చుకుని కూరలో ఉప్పు సమానంగా ఉంటుంది.

చపాతీలు వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి. అదే చల్లారితే గట్టిగా అవుతాయి. చపాతీలు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉండాలి అంటే చపాతి పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు వేసి కలపాలి. అంతేకాకుండా చపాతీ ఒత్తి కొద్దిగా ఆయిల్ వేసి మడత పెట్టి మళ్ళీ ఒత్తుకుంటే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.