Curd For Face:పుల్లటి పెరుగుతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు … చూడండి
Curd Face Benefits:పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం పూర్తి అవ్వాలి అంటే పెరుగు ఉండాల్సిందే. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనలో చాలా మందికి తెలుసు. అలాగే పెరుగులో చాలా బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం కొంత మందికి మాత్రమే తెలుసు.
చర్మం కాంతివంతంగా మారాలి అంటే పెరుగులో కొంచెం బియ్యం పిండి కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసుకుంటే చాలు. ముఖం మీద ఉన్న మొటిమలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోతాయి
పెరుగులో అలోవెరా జెల్ ను కలిపి ముఖానికి రాసి నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చర్మంలో మృత కణాలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. అంతేకాకుండా ముడతలు లేకుండా చేస్తుంది
పెరుగులో సెనగ పిండి కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలు అన్ని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కాబట్టి ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.