Diabetes :కోడిగుడ్డు+వెనిగర్…. షుగర్ ని కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్
Diabetes tips in telugu :డయాబెటిస్… నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి ఎంతో మందిని భయపెడుతోంది. ఏటా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం చాప కింద నీరులా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్-1, రెండోది టైప్-2.
క్లోమ గ్రంథి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చేది టైప్-1 అయితే, ఇన్సులిన్ ఉత్పత్తి అయి కూడా దాన్ని శరీరం సరిగ్గా వినియోగించుకోకపోతే వచ్చేది టైప్-2 డయాబెటిస్. టైప్-1 కన్నా నేడు టైప్-2 డయాబెటిస్‌తోనే అధిక శాతం మంది బాధపడుతున్నారు.
దీన్ని నిర్మూలించేందుకు సరైన మందులు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. కేవలం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు మాత్రమే మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని దీర్ఘకాలంగా వాడితే దాంతో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతున్నాయి.
ఈ క్రమంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో డయాబెటిస్‌ను నిర్మూలించే టిప్ ఒకటుంది. దాంతో డయాబెటిస్ తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. ఆ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కోడిగుడ్డును తీసుకుని బాగా ఉడకబెట్టాలి. అనంతరం దాన్ని పొట్టు తీసేసి ఫోర్క్ సహాయంతో దాని లోపలి వరకు సన్నని రంధ్రాలు చేయాలి. అనంతరం ఓ పాత్రలో గుడ్డు మునిగేంత నీటిని తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్‌ను వేయాలి.
దాంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఉడకబెట్టిన గుడ్డును వేయాలి. అలా రాత్రంతా ఆ గుడ్డును అలాగే ఉంచాలి. ఉదయాన్నే లేచాక గుడ్డును తిని, నీటిని తాగాలి. అంతే, కొద్ది రోజుల్లోనే డయాబెటిస్ తగ్గుముఖం పడుతుండడాన్ని మీరు గమనించవచ్చు.
పైన చెప్పిన మెథడ్‌లో ఉదయాన ఒక గుడ్డు తినాలని అన్నాం కదా. అయితే మధ్యాహ్నం పూట కూడా ఒక గుడ్డును అలాగే తినాలి. దీంతో డయాబెటిస్ మరింత త్వరగా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటే దాంట్లో తగ్గుదలను గమనించవచ్చు కూడా. ఈ టిప్‌ను కొన్ని రోజుల వరకు పాటిస్తే మధుమేహం అదుపులోకి రావడమే కాదు, ఇక మళ్లీ భవిష్యత్తులో వచ్చేందుకు కూడా అవకాశం ఉండదట. అంతటి ఎఫెక్టివ్‌గా ఈ టిప్ పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.