Thyroid:థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!
Thyroid:మన శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాక్షిన్ అనే హార్మోన్ ను విడుదల చేసే ఈ గ్రంథి మన శరీరానికి చాలా కీలకమైంది. అయితే ఈ గ్రంథి ఫంక్షనింగ్ లో వచ్చే సమస్యలతో చాలా మంది హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం అనే రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ రెండు అనారోగ్యాలు మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రకృతి వైద్యంలో థైరాయిడ్ సమస్యకు సులువైన చికిత్సలున్నాయి. కేవలం మన ఇంటి పదార్థాలతోనే సమస్యను అధిగమించొచ్చని వైద్యలు చెబుతున్నారు. ఇంతకూ ఏంచేయాలో కింద వివరంగా తెలుసుకుందాం..
ఇవి కావాలి:
* 50గల ఆకుపచ్చని లేత వాల్ నట్స్
* ఒక కిలో స్వచ్ఛమైన తేనె
తయారీ విధానం:
ముందుగా వాల్ నట్స్ ను తాగునీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాల్ నట్స్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఓ జార్ తీసుకుని వాల్ నట్స్ వేయాలి. ఇక తేనెను పోయాలి. సూర్య కిరణాలు తగిలేలా జార్ ను 40 రోజులపాటు ఓపెన్ గా ఉంచాలి. రాత్రి వేళ ఇంట్లో భద్రపర్చుకోవాలి. ఇక తర్వాత ఒక గాజు బాటిల్ లోకి ద్రావణాన్ని స్టోర్ చేసుకోవాలి.
ఇలా వాడాలి:
* ఉదయం, రాత్రి సమయాల్లో 2 స్పూన్ల చొప్పున తాగాలి.
* ఆ గాజు బాటిల్ లో ద్రావణం పూర్తయ్యేప్పటికీ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మన దేశంతో పాటుగా పలు దేశాల్లో ఈ వైద్యాన్ని అనుసరించి థైరాయిడ్ ను అధిగమిస్తున్నారు.
* అయితే ఇప్పటికే థైరాయిడ్ వ్యాధికి మెడిసిన్ వాడుతున్న వాళ్లు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇది ఆచరించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.