Tollywood Stars:సినిమాలే కాకుండా బిజినెస్ లతో కోట్లు సంపాదిస్తున్న స్టార్ హీరో హీరోయిన్స్.. ఎంత మంది ఉన్నారో…?
Tollywood Stras:ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో హీరోయిన్స్ కి ఉన్న బిజినెస్ గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సొంతంగా GMB ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ పారంభించడంతో పాటు.. ఏషియన్ సినిమాస్ తో కలిసి అత్యాధునిక మల్టిప్లెక్స్ నిర్మించారు. హైదరాబాద్ లో మహేష్ బాబు ఏర్పాటు చేసిన AMB సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు బిజినెస్ మెన్ గా సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు.
మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan)హైదరాబాద్కు చెందిన ట్రూజెట్ అనే ఎయిర్ లైన్స్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి పెద్ద సినిమాలు నిర్మిస్తూ లాభాలను సొంతం చేసుకుంటున్నాడు. అదే విధంగా రీసెంట్ గానే యూవీ బ్యానర్ తో కలిసి యూవీ మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ గా ముందుకు సాగుతూ యుత్ లో కొత్త ట్రెండ్ ని సృష్టించాడు. హిల్ ఎంటర్టైన్మెంట్ పేరు ఓ నిర్మాత సంస్థను స్థాపించి సినిమాల నిర్మాణంలోకి అడుగులు వేస్తున్నాడు. అలాగే మహబూబ్ నగర్ లో AVD పేరుతో భారీ ముల్టీప్లెక్స్ కూడా ఏర్పాటు చేశారు.
అల్లువారబ్బాయి అల్లు arjun కూడా వ్యాపారరంగంలో తనదైన ముద్రను వేసాడు. ఆహా ఓటీటీలో పెట్టుబడులు పెట్టిన అల్లు అర్జున్.. హైదరాబాద్ లోని సత్యం థియేటర్ ని AAA మల్టిప్లెక్స్ గా మార్చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు.
తమన్నా (Tamannah) ఒక వైపు సినిమాలతో బిజీగా ఉంటూ మరో వైపు వైట్ అండ్ గోల్డ్ అనే బంగారు ఆభరణాల స్టోర్ ని సక్సెస్ గా నడుపుతుంది.
కీర్తి సురేష్ (Keerthy suresh) సహజసిద్దమైన వస్తువులతో తయారుచేసిన చర్మ ఉత్పత్తుల బిజినెస్ చేస్తుంది. భూమిత్ర అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ను ఏర్పాటు చేసి బిజినెస్ రంగంలో తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయింది.