Healthhealth tips in telugu

Kidney Stones:మూత్రపిండాల(కిడ్నీ)లో రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

Kidney Stones:మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. సాదారణంగా ఈ రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీడిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింద సాధారణంగా చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. అంతేకాక పెద్ద రాళ్ళ కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది.

1. తగినంత నీటిని త్రాగాలి
తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు పంపుతాయి. ఎక్కువ ద్రవాలను త్రాగితే మూత్రపిండాలలో రాళ్ళ ప్రమాదం తగ్గుతుందని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ తెలిపింది.

పెద్దవారు ప్రతి రోజు తప్పనిసరిగా 10 నుంచి 12 గ్లాసుల నీటిని త్రాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే నీరు ఎక్కువగా త్రాగటం లేదని అర్ధం. నీటితో పాటు నీరు సమృద్దిగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. లేదా శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి నారింజ రసం మరియు నిమ్మరసం త్రాగాలి.

2. కాల్షియం సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవాలి
మనం తీసుకొనే ఆహారంలో కాల్షియం తక్కువైతే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అయిన అక్సలేట్ స్థాయిలు పెరిగిపోతాయి. ఆహారంలో తగినంత కాల్షియం తీసుకుంటే, మూత్రపిండాలకు వెళ్ళకుండా మరియు రక్తంలో కలవకుండా అక్సలేట్ ను ప్రేగుల్లో బందిస్తుంది. ఇంటర్నల్ మెడిసిన్ అన్నల్స్ లో ప్రచురించిన 1997 అధ్యయనంలో ఆహారంలో కాల్షియం ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుందని,అలాగే కాల్షియంను మాత్రల రూపంలో తీసుకుంటే రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపింది.

కాబట్టి కాల్షియం సమృద్దిగా లభించే ఆహారాలను తీసుకోవాలి. శరీరం కాల్షియంను బాగా గ్రహించాలంటే విటమిన్ D అవసరం. అందువల్ల ప్రతి రోజు 15 నిమిషాల పాటు ఉదయాన్నే సూర్యకాంతి శరీరానికి పడేలా చూసుకోవాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే కాల్షియం మాత్రలను వాడకుండా ఉండాలి.

3. అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు
అక్సలేట్ సమృద్దిగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో కాల్షియం శోషణ తగ్గి అది కాల్షియం అక్సలేట్ గా మారి మూత్రపిండాల్లో రాళ్లుగా ఏర్పడుతుంది.

పాలకూర, కాలే, దుంపలు, ఓక్రా, ఆకుకూరలు చాక్లెట్, సోయా పాలు మరియు స్ట్రాబెర్రీ వంటి ఆహారాల్లో అక్సలేట్ సమృద్దిగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువైతే అది కూడా అక్సలేట్ గా మారిపోతుంది.

4. ఉప్పు తీసుకోవటం తగ్గించాలి
సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి మద్దతు కలుగుతుంది. అంతేకాక మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగి మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది.

శరీరంలో అదనపు సోడియంను బయటకు పంపటం మూత్రపిండాలకు కష్టమైన పనిగా మారుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం తగ్గాలంటే, ప్రతి రోజు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఉప్పుకు బదులుగా సముద్ర ఉప్పు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు వంటివి ఉపయోగించాలి.

5. చక్కెర మరియు కృత్రిమ స్వీటెనర్ పరిమితంగా తీసుకోవాలి
అధిక చక్కెర మరియు ఫ్రక్టోజ్ కలిగిన పానీయాలను తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. ఎక్కువగా చక్కెర తీసుకోవడం వలన కాల్షియం మరియు మెగ్నీషియం శోషణ మరియు ఖనిజాల సమతుల్యత దెబ్బతింటుంది.

కొన్ని సందర్భాల్లో, ఫ్రక్టోజ్ జీవప్రక్రియలో అక్సలేట్ గా మారుతుంది. అంతేకాక కృత్రిమ స్వీటెనర్లు మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపుతాయి. చక్కరకు బదులుగా కాఫీ లేదా టీ లో సేంద్రీయ తేనెను ఉపయోగించవచ్చు.

6. ఎరుపు మాంసంను పరిమితంగా తీసుకోవాలి
మన ఆరోగ్యానికి ప్రోటీన్ మంచిది. కానీ ఎరుపు మాంసంను ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం వలన జీవక్రియలో మూత్రపిండాల మీద ఎక్కువగా భారం పడుతుంది. ఎరుపు మాంసం ఎక్కువగా తీసుకోవటం వలన యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

యూరిక్ ఆమ్లంలో ఆమ్ల గాడత ఎక్కువగా ఉండుట వలన మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. యూరాలజీ జర్నల్ లో ప్రచురించిన 2014 అధ్యయనంలో ఆరోగ్యకరమైన వ్యక్తులు జంతు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం వలన సీరం మరియు మూత్రంలో యూరిక్ ఆమ్లం పెరుగుతుందని తెలిపింది.

7. ప్రతి రోజు వ్యాయామం చేయాలి
అధిక బరువు అనేది మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటానికి ప్రతి రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. అలాగే స్థూలకాయంనకు అనారోగ్యకరమైన ఆహారంనకు సంబంధం ఉంది. కొవ్వు ఆహారాలు తీసుకోవటం, శుద్ధి చక్కెరలు మరియు ద్రవాలను తక్కువగా తీసుకోవటం వంటివి మూత్రపిండాలకు చెడును చేస్తాయి.

అంతేకాకుండా ఒక నిశ్చల జీవనశైలి కారణంగా ఎముకలు ఎక్కువగా కాల్షియంను విడుదల చేస్తాయి. ఇది కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. అమెరికన్ నెఫ్రోలాజీ సొసైటీ జర్నల్ లో ప్రచురించిన 2014 అధ్యయనంలో వ్యాయామం చేయటం వలన మూత్రపిండాలలో రాళ్లతో సంబంధం ఉన్న రక్తపోటు మరియు మధుమేహం వంటి వాటిని కూడా తగ్గిస్తుందని తెలిపింది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.