Cracked Lips:పెదాలు పగిలి మంట పెడుతున్నాయా… అయితే ఈ టిప్స్ మీకోసమే
cracked lips Tips In Telugu :మనలో చాలామంది పెదవులు కాలంతో సంబంధం లేకుండా పగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పెదాలు పగిలినప్పుడు తీవ్రమైన మంట నొప్పి ఉంటాయి నొప్పి మంట తగ్గడానికి ఖరీదైన క్రీమ్స్ వాడేస్తుంటారు.
అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది అదే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చు.
టమోటాను చిన్న ముక్కగా కట్ చేసి ఆ ముక్కతో పెదవులను రుద్దాలి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో పెదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో రెండు నుంచి మూడుసార్లు చేస్తే పెదాలు మృదువుగా అందంగా మారుతాయి.
గులాబీ రేకులు కూడా పెదాల పగుళ్లను తగ్గిస్తాయి గులాబీ రేకులను పాలల్లో రెండు గంటలపాటు నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకుని పెదాలకు రాసుకుని 20 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా పెదాల పగుళ్ళు మాయం అయ్యి మృదువుగా మారతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.