Kitchen Tips:ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు
Kitchen Tips and tricks In Telugu :మన వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట తొందరగా అవ్వటమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. అలాంటి వంటింటి చిట్కాలను తెలుసుకుందాం.
ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేసి ఉంచితే, వర్షాకాలంలో ఉప్పు చెమ్మచేరి నీరు కారిపోకుండా ఉంటుంది. ఉప్పు పొడిగా ఉంటుంది. ఉప్పును చాలా మంది నిల్వ చేసుకుంటారు.
పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలంటే పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి. అప్పుడు పెరుగు పులుపు లేకుండా కమ్మగా ఉంటుంది. పెరుగు ఎక్కువ పులుపు ఉంటే దానిలో పాలు కలపాలి.
దోసెలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి.అలాగే చాలా రుచిగా ఉంటాయి. మామూలుగా దోసెలు పెనానికి అతుక్కుపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, పెనంపై ఉల్లిపాయ ముక్కతో రుద్దండి. అప్పుడు పెనం మీద దోసలు బాగా వస్తాయి.
చాలామంది ఆమ్లెట్ వేసేముందు కోడిగ్రుడ్డు సొనలో కాసిని పాలు కలుపుతారు అయితే పాలవల్ల ఆమ్లెట్ గట్టిపడుతుంది. పాలకు బదులుగా ఒక చెంచా నీళ్ళు కలిపితే ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది. కోడిగ్రుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.