Oily Skin For Camphor:జిడ్డు చర్మానికి చెక్ పెట్టే కర్పూరం… ఎలా వాడాలంటే..
Camphor in Telugu :మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ముఖం మీద జిడ్డు సమస్య ఒకటి. స్నానం చేసిన లేదా ముఖం కడిగినా కొంతసేపటికే ముఖం జిడ్డు గా మారిపోతుంది. ఏ లోషన్ రాసిన ఏ క్రీమ్ రాసిన కొద్దిసేపటికి జిగురుగా మారి ముఖం చిరాకుగా మారిపోతుంది.
ఎన్ని సార్లు ముఖం కలిగిన పరిస్థితి ఇలానే ఉంటుంది ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కర్పూరం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక బౌల్లో అర స్పూన్ కర్పూరం పొడి అర స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి.
పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే చర్మంపై అదనంగా ఉన్న జిడ్డు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
కర్పూరం జిడ్డు సమస్యలు తొలగించడమే కాకుండా మొటిమలు రాకుండా నివారిస్తుంది కర్పూరం పొడిలో కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి గంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మొటిమలు తగ్గే వరకు ప్రతిరోజు అలా చేస్తూ ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.