Rose Water For Face:రోజ్ వాటర్ లో దాగి ఉన్న బ్యూటీ ప్రయోజనాలు
Rose water For Face:ప్రతి అమ్మాయి ప్రతి మహిళ ముఖం కాంతివంతంగా అందంగా మెరిసిపోవాల ని కోరుకుంటారు అది సహజం కూడా. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాల ద్వారా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
రోజ్ వాటర్ లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కంటి కింద నల్లటి వలయాలు తొలగించడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి కంటి కింద రాస్తే నల్లని వలయాలు తొలగిపోతాయి. ఈ విధంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు వారం రోజుల పాటు రాస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది.
ఎండలో ఎక్కువగా తిరిగితే ముఖం మీద తాన్ పేరుకుపోతుంది. అలాంటి సమయంలో రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాస్తే సరిపోతుంది.
చర్మంమీద పేరుకుపోయిన పదార్థాలను తొలగించి తాజాగా ఉండేలా చేస్తుంది. చర్మానికి ఒక మంచి టోనర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.