Tomato sauce:టమాటా సాస్ గురించి మనకు తెలియని భయంకరమైన నిజాలు
Tomato sauce recipe :టమోటాలో ఉండే పోషకాలు టమోటా సాస్ లో ఉంటాయా? అసలు టమాటా సాస్ తినడం మంచిదేనా?…. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియకుండానే మనం హాయిగా టమాటా సాస్ ని తినేస్తూ ఉంటాం.
ముఖ్యంగా నేటి యువతరం ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు సాస్ లేకపోతే తినటం కష్టం అయ్యిపోతుంది. కొంతమంది అయితే ఫాస్ట్ ఫుడ్ కన్నా సాస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాని ఇది ఎంత వరకు సురక్షితం అనే విషయాన్నీ తెలుసుకుందాం.
మీరు ఎప్పుడైనా సాస్ బాటిల్ వెనుక గమనించారా? సాస్ లో కేవలం టమాటా కాకుండా ఉప్పు, పంచదార, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఫుడ్ కలర్ లాంటి అనేక పదార్థాలను కలుపుతారు. వీటి ద్వారా మధుమేహం,రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
టమాటా సాస్ గురించి మనకు తెలియని భయంకరమైన నిజాలు టమాటా సాస్ ను తయ్యారు చేసే కొన్ని సంస్థలు ఇందులొ చీప్ క్వాలిటీ పదార్థాలు వాడుతారు. ముఖ్యంగా సాస్ లో గుజ్జు రావడానికి టమాటాకి బదులుగా పుచ్చకాయ, బొప్పాయి లాంటి పండ్ల నుండి తీసిన పిప్పిని వాడుతారు. సాధారణంగా ఇలాంటి సాస్ రోడ్ సైడ్ లభిస్తూ ఉంటాయి.
సాస్ తయ్యారు చేసే సమయంలో నాణ్యత మరియు పరిశుభ్రత పాటించరు. ఇది ఖచ్చితంగా అనేక వ్యాధులకు గురి చేస్తుంది. సాస్ లో వాడే ఫుడ్ కలర్ ద్వారా ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సాస్ లో ప్రథమంగా వాడేది హై ఫ్రూక్టోస్ కార్న్ సిరప్. దీనిలో ఎన్నో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఎంత నాణ్యమైన సాస్ అయినా… అందులో ఇది కలపడం మాత్రం తప్పనిసరి. ఒక టేబుల్ స్పూన్ సాస్ ద్వారా 30 కేలరీలు వస్తాయి. టమాటా లో ఉండే విటమిన్-A, విటమిన్-C మరియు ఫైబర్ లాంటి ముఖ్య పోషక గుణాలు.. సాస్ గా చేసేటప్పుడు కోల్పోతాయి. సాస్ ని తీవ్ర ఉష్టోగ్రత తో తయ్యారు చేస్తారు కాబట్టి టమాటా లోని పోషకాలు అన్నీ నశించిపోతాయి.
ఊబకాయం తో భాధపడుతున్నవారు, ఎలర్జీ, ఆస్తమా లాంటివి ఉన్నవారు టమాటా సాస్ నుండి దూరంగా ఉండడం మంచిది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు సాస్ జోలికి వెళ్లకపోవడం మరీ మంచిది.
టమాటా సాస్ ను అప్పుడప్పుడు తింటే పరవాలేదు. కాని ఇంట్లో ఉంది కదా అని రోజు లాగించేస్తే ప్రమాదాని కొని తెచ్చుకున్నవారవుతారు.
టమాటా సాస్ కి బదులుగా ఇంట్లో చేసుకునే పుదినా, కొత్తిమీర, కరివేపాకు లాంటి చట్నీలు ఎంతో మంచివి. వీటిని రోజు తిన్నా పరవాలేదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.