Jeera Water:పరగడుపున జీలకర్ర,తేనే,నీరు కలిపి త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు
jeera water benefits :Jeera Water:పరగడుపున జీలకర్ర,తేనే,నీరు కలిపి త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు..ఉదయం పరగడుపున ఈ నీటిని తాగితే ఎన్ని ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు.
కావాల్సిన పదార్థాలు
జీలకర్ర – 2 టీ స్పూన్లు
తేనె – 2 టీ స్పూన్లూ
నీళ్లు – 1 కప్పు
తయారు చేసే విధానం
ఒక కప్పు నీటిని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జీలకర్ర వేయాలి. 10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత.. ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ లో తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు.
ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల బ్లడ్ లో పేరుకున్న మలినాలను యూరిన్ ద్వారా బయటకుపంపవచ్చు. దీనివల్ల ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం… జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేసి.. అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలను దూరంగా ఉంచుతుంది.
జీరా, తేనె కాంబినేషన్ మలబద్దకం నివారించడానికి ఎఫెక్టివ్ రెమిడీ. కాబట్టి మలబద్దకం తో బాధపడేవాళ్లు.. ఈ మిశ్రమాన్ని తాగితే.. ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.
జీరాలో క్యుమినల్ డిహైడ్ ఉంటుంది. ఇది.. క్యాన్సర్ కణాలు పెరగకుండా, శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
జీరా వాటర్, తేనె మిశ్రమంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఈ న్యాచురల్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇది.. శ్వాస సంబంధ సమస్యలను నివారించి.. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.
జీరా వాటర్, తేనె మిశ్రమంలో.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రమం ఐరన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల అనీమియాను నివారించవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.