Face Glow Tips:4 బాదం పప్పులతో ఇలా చేస్తే …. ముడతలు,నల్లని మచ్చలు మాయం
Almond Face Tips : ఈ రోజు ముఖం మీద నల్లని మచ్చలు మరియు ముడతలు తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కాను తెలుసుకుందాం. ఈ చిట్కాలో బాదాం ఉపయోగిస్తున్నాం. బాదాం చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. బాదంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ కణాలు ఆక్సీకరణకు గురి కాకుండా చూస్తాయి.
అంతేకాక వృద్దాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. మొటిమలు,బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తాయి. బాదంలో ఉండే విటమిన్ E చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా కాంతివంతంగా చేస్తుంది. అంతేకాక సూర్య కిరణాల నుండి చర్మ కణాలు డేమేజ్ కాకుండా రక్షిస్తుంది. బాదం కంటి కింద నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది.
దీని కోసం 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి దానిలో అరస్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి.
పెరుగు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.