Devotional

Lord hanuman:హనుమంతుడికి వెన్నాభిషేకం చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా ?

Anjaneya swami Abhishekam : ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ఆరాధన చేస్తుంటారు. శివుడికి విభూది, జలం, బిల్వ పత్రాలు ఇలా పలు రకాల వస్తువులతో పూజిస్తే మంచిదని అంటారు. అలాగే పంచామృతాభిషేకం , పూలాభిషేకం విష్ణువుకి మంచిదని అంటారు.

ఇక రామ అంటే ప్రత్యేక్షమయ్యే అపర రామభక్తుడు హనుమంతుడు. రాముడిని పూజిస్తూ, ఆంజనేయుడిని కూడా పూజిస్తే భూత ప్రేత గ్రహ పీడలు వదిలిపోతాయని కూడా చెబుతారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేస్తే మంచిదని అంటారు.వినాయకుడికి గరిక పూజ చేస్తే ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ ముఖ్యమని అంటారు.

తమలపాకులతో చేసే పూజ మంచి ఫలితం ఇస్తుందని అంటారు. అలాగే సింధూరం తో పూజ చేయడం మంచిదని చెబుతారు. అలాగే అమావాస్య, కృష్ణ, శుక్ల పక్ష నవమి తిధినాడు వెన్నభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుందని చెబుతారు. వెన్నతో అభిషేకం చేస్తే దోషాలు , ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి.