Cracked Heels:పాదాల పగుళ్ళను మాయం చేసే ఆకు….ఇలా చేస్తే సరిపోతుంది
Home remedies for cracked heels In Telugu : చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తూ ఉంటాయి. పాదాల పగుళ్లను తగ్గించు కోవటానికి తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలను ఫాలో అవవ్వచ్చు.
రావి ఆకులతో పాదాల పగుళ్ళను సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రావి ఆకుల గుజ్జు లేదా వాటి పాలను పగుళ్లు వచ్చిన చోట రాయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. రావి ఆకులో ఉన్న పోషకాలు పగుళ్ళను తగ్గించి ఆ ప్రదేశంలో కొత్త కణాల అభివృద్ధికి సహాయపడుతుంది.
రావి ఆకులను తీసుకోని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని పాదాల పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా రెండు నిముషాలు మసాజ్ చేయాలి. ఒక అరగంట అయ్యాక చల్లని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు వారం రోజుల పాటు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు మాయం అవుతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేతుంది.
అలాగే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే రావి ఆకులను తాజాగా ఉన్నవి తీసుకోవాలి. అలాగే రావి ఆకుల పేస్ట్ తాజాగా చేసుకోవాలి. కొంత మంది ఒకేసారి ఎక్కువగా రావి ఆకుల పేస్ట్ తయారుచేసుకొని ఫ్రిజ్ లో నిల్వ చేసుకొని వాడుతూ ఉంటారు. చాలా ఎఫెక్టివ్ గా పని చేయాలంటే తాజా పేస్ట్ ఉండాలి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు రావి ఆకుల పేస్ట్ తయారుచేసుకోవటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.