Mokka Jonna Gatka:పురాతన వంటకం మొక్కజొన్న గట్క చేసుకొని తింటే ఆరోగ్యం మీసొంతం
Mokka Jonna Gatka: పురాతన తెలుగు వారి వంటకం.ఎంతో ఆరోగ్యకరమైన మొక్క జొన్న గట్కా ఈ రోజుల్లో చాలావరకు చేయడం మానేసారు. కాని ఒక్క సారీ టేస్ట్ చూస్తే మాత్రం అస్సల్ వదలరు. రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇంకెందుకు ఆలస్యం మొక్క జొన్న గట్కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మొక్క జొన్న రవ్వ – 1 కప్పు
నీళ్లు – 4 కప్పులు
ఉప్పు – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా మొక్క జొన్న రవ్వకోసం ఇంట్లో కూడ తయారు చేసుకోవచ్చు.
2.మొక్క జొన్న రవ్వలోకి కొద్దిగా నీళ్లు చిలకరిచ్చుకోని కలుపుకోవాలి.
3.ఇప్పుడు ఒక బాండీలో ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లను పోసుకొని ఉప్పు వేసి ఎసరు మరిగించుకోవాలి.
4.ఎసరు మరుగుతున్నప్పుడు కొద్దిగా చల్ల నీళ్లు వేసి అందులోకి ఇప్పుడు రవ్వను వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
5.స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోని రవ్వను ఉడికించుకోవాలి.
6.గట్క కాస్త లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.చల్లారిన తర్వాత మరి కాస్తా గట్టిగా తయారౌతుంది .
8. తయారు చేసుకున్న గటక ను పెరుగు,ఊరగాయలతో సర్వ్ చేసుకోవడమే.