Tea Side Effeects :పరగడుపున “టీ” తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్
Tea Side Effeects :ప్రతి రోజూ ఉదయం పరగడుపున టీ తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. వీటి గురించి తెలుసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పరగడుపున టీ తాగడం వల్ల పొందే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం…
ప్రతి రోజు ఉదయం పరగడపున బ్లాక్ టీ తాగడం వలన కడుపుబ్బరంగా అనిపిస్తుంది. దాంతో అసౌకర్యంగా ఉంటుంది. రోజంతా చురుకుదనం లోపిస్తుంది.
ప్రతి రోజూ పరగడపున టీ తాగడం వల్ల పొట్టలో గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దాంతో ఆకలి మందగిస్తుంది.
టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది.
టీలో ఉండే టానిన్స్ రోజంతా వాంతి అయ్యేట్లు ఫీలింగ్ కలిగిస్తుంది. పరగడుపున టీ తాగడం వల్ల వాంతులు వికారంగా అనిపిస్తుంది.
మిల్క్ టీ తాగడం వల్ల రోజంతా అలసటగా అనిపిస్తుంది. అలాగే తరచూ మూడ్ మారుతుంటుంది.
ప్రతి రోజూ చాలా స్ట్రాంగ్ టీ తాగే వారిలో అల్సర్ కు దారితీస్తుంది. స్టొమక్ అల్సర్ కారణమవుతుంది.
ప్రతి రోజూ ఉదయం జింజర్ టీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి
టీలో కెఫిన్, ఎల్ థైనిన్స్ మరియు థయోఫిలైన్ అధికంగా ఉండటం వల్ల అజీర్తికి కారణమవుతుంది.
టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. 5 నుండి 8 కప్పుల టీ తాగే వారిలో దీర్ఘ కాలంలో నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.
టీ ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు డ్యామేజ్ అవుతాయి .
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.