Beauty Tips

Head Lice:ఈ చిన్న చిట్కాతో తలలో పేలు మొత్తం మాయం…జీవితంలో పేలు అసలు ఉండవు

How to remove Head Lice In Telugu :తలలో ఉండే పేలు ఒకరి నుండి ఒకరికి చాలా తొందరగా వ్యాపిస్తాయి. పేలను వదిలించుకోవటం చాలా కష్టం. పేలను తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి పెద్దగా ప్రభావాన్ని చూపవు. తలలో పేలను అశ్రద్ధ చేస్తే తలలో పుండ్లు, దురద, తలమీద చర్మం దెబ్బతింటుంది. పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రత దెబ్బతింటుంది.

పేలను ఇంటి చిట్కాల ద్వారా చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం ఒక బౌల్ లో ఐదు కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేయాలి. అర చెక్క నిమ్మరసం పిండాలి.ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. కర్పూరం, నిమ్మరసం,కొబ్బరి నూనె బాగా కలిసేలా బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ నూనెలో ఉండే ఘాటైన వాసనకు పేలని మత్తుగా చనిపోయి ఉంటాయి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి చిన్న పళ్ళతో దగ్గరగా ఉన్న దువ్వెనతో దువ్వితే చచ్చిపోయిన పేలు, గుడ్లు అన్ని బయటకు వచ్చేస్తాయి.

పేల సమస్య ఉన్నవారు వారంలో ఒకసారి ఈ విధంగా చేస్తే కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయట పడతారు. ఈ మిశ్రమం తలకు రాయటం వలన చుండ్రు,దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.