Dark circles:2 రూపాయిల ఖర్చుతో 7 రోజుల్లో కంటి కింద నల్లని వలయాలు మాయం అవుతాయి
Remove dark circles Home Remedies : కళ్ళు అనేవి ముఖానికి అందాన్ని ఇస్తాయి. అలాంటి కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఉంటే ముఖం అందం తగ్గటమే కాకుండా మానసికంగా కాస్త నిరాశ చెందుతాము. నల్లని వలయాలు రావటానికి పని ఒత్తిడి, నిద్రలేమి, హర్మోన్లలో మార్పులు వంటివి కారణలుగా చెప్పవచ్చు.
మనలో చాలా మంది నల్లని వలయాలు రాగానే చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. వీటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో నల్లని వలయాలకు చెక్ పెట్టవచ్చు.
కంటి కింద నల్లని వలయాలను తగ్గించటానికి కరక్కాయ చాలా బాగా సహాయపడుతుంది. కరక్కాయను ఆయుర్వేదంలోను మరియు మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించేవారు. సాన మీద 4 చుక్కల నీటిని పోసి కరక్కాయను అరగదీసి…ఆ పేస్ట్ ని కంటి చుట్టూ నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో రాయాలి.
పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు చేస్తే నల్లని వలయాలు తగ్గుతాయి. ఆ ప్రదేశంలో ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. నల్లటి వలయాలను శాశ్వతంగా క్లియర్ చేయడానికి కరక్కాయ బాగా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.