Bhanupriya:భానుప్రియ ఇప్పుడు ఏమి చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు
Tollywood Heroine Bhanupriya:కళ్లతోనే భావాలు పలికించే అందాల అభినేత్రిగా భానుప్రియకు పేరుంది. 80,90వ దశకాల్లో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది భానుప్రియ. పదహారణాల తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భానుప్రియ అసలు పేరు మంగభాను.
రాజమండ్రి సమీపంలోని రంగంపేట ఆమె స్వస్థలం.తండ్రి పండుబాబు, తల్లి పేరు రాగమాలి. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. సుమారు 150కి పైగా సినిమాల్లో నటించిన భానుప్రియ అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంట అగ్రహీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
భావుకత ఉన్న దర్శకుడు వంశీ డైరక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సితారతో తెలుగుతెరకు పరిచయం అయింది. ఆ సినిమా జాతీయస్థాయిలో అవార్డు అందుకోవడంతో భానుప్రియ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వంశీ డైరక్షన్ లో వచ్చిన అన్వేషణ, ఆలాపన చిత్రాలు కూడా నటిగా భానుప్రియకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.
అసలు భానుప్రియ కోసమే వంశీ ఆ సినిమాలను అంత శ్రద్ధగా తెరకెక్కించాడేమో అన్నట్టుగా ఉంటాయి ఆ మూడు చిత్రాలు. ఒక దశలో ఆయన భానుప్రియను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయగా, ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట. అప్పటికే వంశీకి పెళ్లయిపోయి ఉండడమే అందుకు కారణం.
ఇక ఆ తర్వాత సీరియస్ గా కెరీర్ పై దృష్టిపెట్టిన భానుప్రియ తెలుగు , తమిళంలో అనేక మరపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. కెరీర్ డల్ అవుతుందన్న తరుణంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్ ను పెళ్లాడింది. అమెరికాలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది.
భానుప్రియ, ఆదర్శ్ దంపతులకు అభినయ అనే పాప ఉంది. భర్త నుంచి భాను ప్రియ విడాకులు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదని భాను ప్రియ తెలిపింది. 2018లో భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుంచి భాను ప్రియ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.
అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది. అంతేకాదు, ఓ డ్యాన్స్ స్కూల్ స్థాపించి కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది. అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించిన భానుప్రియ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది.
భాను ప్రియ కూతురు అభినయ ప్రస్తుతం లండన్‌లో నాచురల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతోంది. తన కూతురు అభినయకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని భానుప్రియ అన్నది.
గత కొన్నాళ్లుగా మెమొరీ లాస్ సమస్య కారణంగా సినిమాలు దూరంగా ఉంటోంది భాను ప్రియ.