Beauty Tips

Dark Lips:నిమ్మరసంతో ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

Dark lips home remedies in telugu : పెదాలు నల్లగా లేకుండా గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి. అయితే ఆహారపు అలవాట్లు., ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.
Dry lips beauty tips
అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Honey benefits in telugu
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పగిలిన,నల్లగా మారిన పెదాలు మృదువుగా,కాంతివంతంగా మారతాయి. నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ మరియు ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మంపై మృత చర్మ కణాలను తొలగిస్తుంది. అలాగే నిమ్మరసంలో ఉండే యాసిడ్ పెదాలపై నలుపును తగ్గిస్తుంది.

తేనె పెదాలకు తేమను అందిస్తుంది. పగిలిన పెదాలను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. ఇది తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేసి చర్మంపై మృత చర్మ కణాలను తొలగిస్తుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా నల్లగా మారిన పెదాలను గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.