Kitchenvantalu

Kaju Pakodi: చల్లటి వర్షం చూస్తూ, వేడివేడిగా జీడిపప్పు పకోడిలు తినండి

Kaju Pakodi Recipe: పకోడి అనగానే, నోట్లో నీరు ఊరనివారు ఉండరు. ముఖ్యంగా రెయినీ, వింటర్ సీజన్స్ లో, చల్లచల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడి తింటే, ఆ మజానే వేరు. ఎప్పుడు చేసే ఉల్లిపాయ పకోడి కాకుండా, కాజూ పకోడి ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి -150 గ్రాములు
జీడిపప్పు పలుకులు – 100 గ్రాములు
గరం మసాలా – ½ స్పూన్
ధనియాల పొడి – ½ స్పూన్
నెయ్యి లేదా నూనె – 1 టీ స్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
కారం – 1 స్పూన్
జీలకర్ర – 1 స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ విధానం
1.ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులోకి జీడిపప్పులు వేసి, తగినంత నీరు పోసి, రెండు గంటల పాటు నానపెట్టాలి.
2.రెండు గంటల తర్వాత కాజూలను వడకట్టి, శనగపిండి, మరియు కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు,నెయ్యి, వేసుకుని పొడిపొడిగా కలుపుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.

4. వేడెక్కిన నూనెలో పకోడీలను, పొడిపొడిగా విడివిడిగా వేసి, ఎర్రని రంగు వచ్చేవరకు, వేయించుకోవాలి.
5. అవి వేగడానికి 12 నుంచి 15 నిముషాల వరకు పడుతుంది.
6. వేగిన పకోడీని జల్లి గరిటె సహాయంతో ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
7. పకోడి చల్లారిన తర్వాత, కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే, వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.