Hair Fall Tips:ఓట్స్ తో ఇలా చేస్తే జుట్టు నుండి ఒక్క వెంట్రుక రాలదు…రాలిన జుట్టు దగ్గర 2 రెట్లు జుట్టు వస్తుంది
Oats Hair Fall Home Remedies : జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొంతమంది ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించుకుంటే… కొంత మంది జుట్టు రాలే సమస్యతో జుట్టు లేక జుట్టును పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు ఒత్తుగా పెరగడానికి మార్కెట్లో దొరికే ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. .
ఎందుకంటే మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టు పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఓట్స్, అరకప్పు పాలు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. నానిన ఓట్స్ పాలతో సహా మిక్సీలో వేయాలి.
ఆ తర్వాత ఒక ఎగ్ వైట్, 3 మందార పువ్వులు, మూడు మందార ఆకులు, ఒక స్పూన్ తేనె వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ గ్లిజరిన్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఒట్స్ లో ఫైబర్, జింక్, ఐరన్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు మరియు పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉండుట వలన నిద్రాణమైన జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.