MoviesTollywood news in telugu

Allu arjun:Arya 2 సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Allu Arjun Arya 2 Movie : అల్లు అరవింద్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన Allu Arjun తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళుతున్నాడు. అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య హిట్ తర్వాత సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 చాలా రిచ్ గా ,స్టైలిష్ గా కొత్త విధానంతో సుకుమార్ తెరకెక్కించాడు. అయితే ఇది జనానికి సరిగ్గా రీచ్ కాలేదని అనుకుంటారు.

కమర్షియల్ గా హిట్ సాధించినా,అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆడలేదు. కేరళ కలెక్షన్స్ కూడా జోడిస్తే, కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ కానీ కొందరు ప్లాప్ అని కూడా అనేస్తారు. 20కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ప్రారంభం నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆర్య లాంటి హిట్ మూవీ తీసిన డైరెక్టర్ సుకుమార్,హ్యాపీ వరకూ హిట్స్ అందుకున్న బన్నీ, మగధీరతో నెంబర్ వన్ హీరోయిన్ గా మారిన కాజల్ అగర్వాల్ ఈ ముగ్గురు కల్సిన ప్రాజెక్ట్ కావడంతో ఆర్య 2కి ఎనలేని హైప్ క్రియేట్ అయింది.

భారీ అంచనాలతో 2009 నవంబర్ 27న అత్యధిక ప్రింట్స్ తో రిలీజైన ఈమూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ. పోకిరి,మగధీర మూవీస్ తో తెలుగు సినిమా 30కోట్ల కలెక్షన్స్ దాటేస్తే, ఆర్య 2మాత్రం 20కోట్లు కలెక్ట్ చేసింది. మలయాళ రైట్స్ కూడా కోటి రూపాయలు తెచ్చింది. నిర్మాతకు లాభమే కానీ, నష్టం లేదు. అయినా ఈ మూవీని ఎందుకో ప్లాప్ గానే కొందరు చెబుతారు.

ఆర్య మూవీతో పోల్చి చూస్తే, ఆర్య 2లోని పాత్ర ఫాన్స్ కి పెద్దగా ఎక్కలేదని చెప్పొచ్చు. ఆర్య క్లాసిక్ మూవీ. ఆర్య 2విషయంలో కూడా అదే ఊహించుకుని హైప్ క్రియేట్ చేసారు. ఆర్యతో లవ్ సక్సెస్ కావాలనే విధంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ఆర్య 2లో మాత్రం తన ఫ్రెండ్ లవ్ సక్సెస్ కావాలని కోరుకోవడం, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియక పోవడం వంటి అంశాలతో రూపొందిన పాత్ర.

ఓ విధంగా చెప్పాలంటే,ఆర్య మూవీ రాకపోతే,ఆర్య 2పెద్ద హిట్ అయ్యేది. ఆర్య 2లో హీరో పాత్ర అర్బన్ ప్రాంత ఆడియన్స్ కి తప్ప నార్మల్ ఆడియన్స్ కి అర్ధం కాలేదు. ఓ స్థిరత్వం, వ్యక్తిత్వం ఉండే పాత్రలకు తప్ప ఇలాంటి విభిన్న క్యారెక్టర్స్ ని జీర్ణించుకోలేరు.

నవంబర్ లో కాకుండా సంక్రాంతికో,క్రిస్ మస్ కో రిలీజ్ చేసి ఉంటే సినిమా బాగా ఆడేది. ఇక జై సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మెగాస్టార్ చిరంజీవి అనుకూల నిర్ణయంతో అల్లు అర్జున్ సినిమా తెలంగాణలో నిలిపేశారు. నైజాం లో నష్టం వచ్చింది.