Beauty Tips

Hair Care Tips:జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే ఈ నూనె రాస్తే జుట్టు ఒత్తుగా,పొడవుగా, చాలా స్పీడ్ గా పెరుగుతుంది

Hair Fall And Hair Growth Tips : మనలో చాలామంది జుట్టు రాలిపోయి జుట్టు చాలా పల్చగా ఉందని బాధపడుతూ ఉంటారు. దీని. కోసం రకరకాల నూనెలను వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం రాక నిరాశ చెందుతూ మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతూ ఉంటారు. దీనికోసం వేల కొద్ది డబ్బును ఖర్చుపెట్టిన పెద్దగా ఫలితం ఉండదు.
Onion beaUTY tIPS
మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి నూనె తయారు చేసుకుని వాడితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఒక గిన్నెలో 300 ml కొబ్బరి నూనె తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, నాలుగు లవంగాలు, ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
Mustard seeds Benefits In telugu
ఆ తర్వాత పది తులసి ఆకులు, గుప్పెడు గోరింటాకు, గుప్పెడు మందారాకులు, గుప్పెడు కరివేపాకు, ఐదు మందార పువ్వులు, మూడు స్పూన్ల ఎండు ఉసిరికాయ ముక్కలు, గుప్పెడు గరిక ఆకులు వేసి పొయ్యి మీద పెట్టి నూనె రంగు మారేవరకు బాగా మరిగించాలి. ఇలా మరిగిన నూనెను వేడిగా ఉండగానే మరొక గిన్నెలోకి వడగట్టాలి.
fenugreek seeds
ఈ నూనెను ప్రతిరోజు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి ఈ విధంగా 15 రోజులపాటు రాస్తే కచ్చితంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. వారంలో రెండు సార్లు కుంకుడుకాయలతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ లో ఉన్న లక్షణాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి ప్రోత్సహిస్తాయి.
Hair fall Tips in telugu
జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఈ నూనెను తప్పనిసరిగా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.