Healthhealth tips in telugu

Eggs:గుడ్డు పచ్చిగా లేదా ఉడికించి తినాలా….నిజాన్ని తెలుసుకోండి

Egg Benefits In telugu :​ఉడికించిన కోడిగుడ్లతో ప్రయోజనాలు
ఉడికించిన గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి అన్ని వయసుల వారికి మేలు చేస్తాయి. రోజూ గుడ్డుని తినడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు.

ఇందులో కాల్షియం, ఐరన్ శాతాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఎ, బి5, బి12, బి2, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు, 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా.. రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

పచ్చి గుడ్డు మంచిదేనా..
పచ్చి గుడ్డుని తినడం మంచిదేనా అనే చర్చ ఉంటూనే ఉంటుంది. ఇది ఎంత వరకు మంచిదంటే.. నిజానికీ పచ్చి కోడి గుడ్లలో సాల్మొనెల్లా అనే ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఇది తక్కువ మోతాదులోనే ఉంటుంది కాబట్టి అంతగా ఇబ్బంది ఉండదు.

కానీ, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి కాస్తా ఇబ్బంది అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలో కొన్ని సమస్యలను తీసుకొస్తుందని చెబుతున్నారు. అలా అని ఇలా పచ్చిగా తినడం పెద్ద ప్రమాదం ఏం కాదని సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో తాగడం మంచిదని చెబుతున్నారు..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.