Devotional

Shani Dev:ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా?

Shani Dev:సాధారణంగా ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుందని మన జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పుతున్నారు.ఏలినాటిని ఏడునాడు అని కూడా పిలుస్తారు. నాడు అంటే అర్ధభాగం అని అర్ధం. జాతకచక్రంలో ఉన్న 12 రాశులుగ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు గృహ ప్రభావం ప్రారంభం అవుతుంది. .

12,1,2 స్థానాల్లో శని ప్రవేశించినప్పుడు శని గ్రహ ప్రభావంప్రారంభం అవుతుంది. శని ప్రభావం ఒక్కో స్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. మూడు స్థానాల్లో కలిపి ఏడున్నర సంవత్సరాలు శని ఉండటం వలన శని ప్రభావం ఉంటుంది.

శని గ్రహం ప్రభావం కారణంగా కష్టాలు కలుగుతాయి. ఆ కష్టాలు మాములుగా ఉండవు. విపరీతంగా ఉంటాయి. శని గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ప్రాణభయం, దనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథ‌మ‌స్థానానికి వెళ్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

అయితే కొన్ని సార్లు శని గ్రహం మంచి పనులు జరగటానికి కూడా సహాయపడతాయి. ఆ పనులు పూర్తి కావటానికి కూడా అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది.

అయితే శని ప్రభావం తగ్గాలంటే విష్ణుసహస్రనామం, సుందరాకాండ పారాయణం, ఆదిత్యహృదయం, భగవంతుని ప్రార్థన చేయాల్సి వుంటుంది.ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.

కాకులకు ఆహారాన్ని వేయాలి.అలాగే నల్ల చీమలకు పంచదార వేయటం వంటివి చేస్తే శని ప్రభావం తగ్గుతుంది.ఎన్ని సమస్యలు వచ్చిన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం.

కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నమ్మకం బట్టి ఉంటుంది. కొంత మంది వీటిని పెద్దగా పట్టించుకోరు. మరి కొంత మంది వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని బట్టి ముందడుగు వేయాలి.

నమ్మకం ఉంటేనే ఏదైనా చేయటానికి సిద్దపడతాము. అయితే మనలో చాలా మంది జాతకాలను నమ్ముతు ఉంటారు. శని ప్రభావం తగ్గటానికి తగ్గట్టుగా ప్నివరణ చర్యలను చేపట్టాలి. దానికి అనుగుణంగా అడుగులు వేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.