Gaddi chamanthi:మీ చుట్టుపక్కల కనిపించే ఈ మొక్కను అసలు వదలద్దు…ఊహించని లాభాలు ఎన్నో..
Gaddi chamanthi Health Benefits in telugu : మీరు ఎప్పుడైనా గడ్డిచామంతి పేరు విన్నారా…గడ్డి చామంతి పువ్వులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి పల్లెటూర్లలో పొలాల గట్ల మీద రోడ్డుకు ఇరువైపులా ఇంటి పెరట్లో ఎక్కడపడితే అక్కడ ఈ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇవి పిచ్చిమొక్కలుగా భావించి మనం పెద్దగా పట్టించుకోం అయితే దీనిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఇంటిలో పెంచుకోవటానికి శ్రద్ధ పెడతారు.
చెట్టు మొత్తం ఔషధగుణాలతో నిండి ఉంది ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే జుట్టు రాలి పోవటం తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది అలాంటి వారు ఈ చెట్టు ఆకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా ఉండదు.
ఈ చెట్టు ఆకులను నాలుగు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే ఈ ఆకులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
కాలేయ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.ఈ ఆకులతో నూనె తయారు చేసుకుని రోజు తలకు రాసుకుంటే జుట్టు పెరగడంతో పాటు చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది
అయితే ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలి అంటే గడ్డిచామంతి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి ఆవనూనెలో వేసి బాగా మరిగించాలి ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.